చిన్నారుల అభ్యసనం ఆనందభరితం కావాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్: పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ, అభ్యసనాన్ని ఆనందభరితంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) తెలిపారు. మంగళవారం మావల (Mavala) ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రీ ప్రైమరీ పాఠశాలను (Pre-Primary School) కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇండోర్, అవుట్‌డోర్ ఆట వస్తువులు, డ్యాన్స్‌, పాటల కోసం మైక్ సెట్లు, ఊయలలతో పాటు చిన్నారులను ఆకట్టుకునేలా రూపొందించిన అభ్యసన సామగ్రిని పరిశీలించారు.

వీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ బోధనను మరింత మెరుగుపరచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం చిన్నారులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మణ్, జిల్లా విద్యాశాఖాధికారి మాధవి, పీఎంఓ మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>