‘కేసీఆర్ ఇంటిపై దాడికి యత్నం’.. కేటీఆర్ ఆగ్రహం!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)  పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు వీలుగా పోలీసులు బ్రహ్మండంగా ఎస్కార్ట్ ఇచ్చి మరీ పంపుతున్నారని మండిపడ్డారు. ‘బాగుంది.. తెలంగాణ డీజీపీ, రాహుల్ గాంధీ.. ఇదిగో చూడండి మీ మొహబ్బత్ కి దుకాణ్ ఎలా ఉందో’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు, ఎర్రవల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫాంహౌస్ ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివస్తుండగా.. వారిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సైతం చేరుకుంటున్నారు.

దీంతో ఫాంహౌస్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ అధికారులు అప్రమత్తమై అదనపు బలగాలను అక్కడకు రప్పిస్తున్నారు. దామరకుంట వద్ద భువనగిరి నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతల కార్లపై బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని చెదరగొట్టారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ స్వయంగా ఎర్రవల్లికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>