Mobile Popup Ad
Mobile Popup Ad

ఫోన్ పేలో లంచాలు.. 8 మంది అధికారుల సస్పెండ్

కలం, డెస్క్ : తెలంగాణలో అధికారుల లంచాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇంతకు ముందు క్యాష్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్ల బాట పట్టారు. తాజాగా విద్యుత్ డిపార్టుమెంట్ లో 8 మంది అధికారులు (Officials Suspended) ఫోన్ పేలో లంచాలు తీసుకుని అడ్డంగా దొరికిపోయారు. టీజీఎస్పీడీసీఎల్ లో ఏడీఈ, ఏఈ, సబ్ ఇంజినీర్లు మొత్తం 8 మంది రకరకాల పనుల్లో ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో తేలింది.

యాంటీ బ్రైబరీ సెల్ కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేసింది. ఫోన్ పే ద్వారా లంచాలు తీసుకున్నట్టు ఆధారాలు దొరకడంతో ఆ 8 మందిని సస్పెండ్ (Officials Suspended) చేసింది ప్రభుత్వం. అయితే దీనిపై సదరు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల వాదన మరోలా ఉంది. రీసెంట్ గా తాము ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేయడంతోనే ఇలా కక్ష సాధింపులకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>