కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని నిషేధిత భూముల జాబితా 22-ఏ (Telangana 22A Lands)తో ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ఆస్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. యూఎల్సీ, 22-ఏ ఆంక్షల్లో చిక్కుకున్న ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతినిస్తూ రెవెన్యూ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నూతన ఆదేశాల ప్రకారం, 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డీఏ, డీటీసీపీ లేదా ఇతర స్థానిక సంస్థల నుంచి అధికారిక ప్లానింగ్, లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులు పొందిన ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు లభించనుంది. దరఖాస్తుదారులు సదరు అనుమతి పొందిన తర్వాత జరిగిన లావాదేవీలకు సంబంధించి కనీసం ఒక లింక్ డాక్యుమెంట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

