ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి TJAC మహాధర్నా..

కలం, కరీంనగర్ బ్యూరో: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీలు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ (TEJAC, TNGOs) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని, CPSను రద్దు చేసి OPSను పునరుద్ధరించాలని దారం శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించే EHSను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

అలాగే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన సొంత డబ్బుల కోసం ఉద్యోగులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి రావడం, న్యాయం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం అత్యంత దయనీయమైన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఉద్యోగులకు ఉద్యమాలు కొత్త కాదు. మా సహనాన్ని పరీక్షించవద్దు.. మా సహనాన్ని చేతగానితనంగా చూడవద్దు” అని దారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తమ పిల్లల వివాహాలు చేయలేక, నూతన గృహాలు నిర్మించుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక, అనారోగ్యానికి గురైనప్పుడు సరైన వైద్యం చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. “ఉద్యోగుల కన్నీటిని తుడిచే బాధ్యత ప్రభుత్వానిదే. ఉద్యోగులను కంటికి రెప్పలా, కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది” అని పేర్కొన్నారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, సమస్యలపై సానుకూలంగా స్పందించకుండా వాటిని పక్కనపెట్టి ముందుకు సాగుతున్న ధోరణి కనిపిస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, PRC అమలు, పెండింగ్‌లో ఉన్న DAలు/DRల విడుదల, CPS సమస్య పరిష్కారం, ఉద్యోగులు–పెన్షనర్లకు సంబంధించిన ఇతర దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య ధోరణిని కొనసాగిస్తే, ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో మరింత ఉధృతమైన సమరం తప్పదని TNGOs సంఘం, TGEJAC నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, సెక్రెటరీ జనరల్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేశవరెడ్డి, ఉస్మాన్ పాషా, ఈశ్వరయ్య అశోక్ రావు ఎండి సలీం కరుణాకర్ రెడ్డి ఎలదాసరి లింగయ్య రామస్వామి శంకర్ ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్ సింగ్, రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, శారద వరీస్ నవాబు సతీష్ జనార్ధన్ చంద్రమౌళి ప్రభాకర్ రావు కే రాజు నరసింహారెడ్డి లక్ష్మణరావు శ్రీనివాస్ విజయ్ తిరుపతి రెడ్డి నరసయ్య సత్యనారాయణ రెడ్డి ప్రేమ్ సాగర్ వెంకట రాజిరెడ్డి అభినవ్ రెడ్డి ఎండి అబ్దుల్ ఎండి యూసుఫ్ రామ్మోహన్ రావు పోలుకిషన్ రమేష్ గౌడ్ ప్రసాద్ రెడ్డి నరేష్ పటేల్ సత్యనారాయణ సరిత కరుణ రోహిత్ గుండ రాజేష్ కమలాకర్ కరుణాకర్ అజ్గార్ అలీ లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు :

1. రెండవ పీఆర్సీని 01-07-2023 నుంచి వెంటనే అమలు చేయాలి.
2. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలు/డీఆర్‌లను వెంటనే విడుదల చేయాలి.
3. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలి.
4. పెండింగ్ బిల్లుల చెల్లింపులను కొనసాగించాలి. ప్రతి నెల కనీసం రూ.2,000 కోట్ల మేర నిధులు విడుదల చేయాలి.
5. నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS)ను పూర్తిస్థాయిలో, సక్రమంగా అమలు చేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>