ఐర్లాండ్ కొంపముంచింది.. గంభీర్ చాప్టర్ ముగిసినట్లేనా?

కలం, స్పోర్ట్స్: ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ క్లీన్‌స్వీప్‌నకు గురై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వడం, గంభీర్ ఆటగాళ్ల ఎంపిక తీరును విమర్శకులు తప్పుబడుతున్నారు. ప్రస్తుత టీ20 ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత్ ఇలా ఓడిపోవడంతో ఐస్లాండ్ క్రికెట్ కూడా సోషల్ మీడియాలో గంభీర్‌ను ఎద్దేవా చేసింది. అంతటి ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లతో ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలు రాబట్టడం అసాధారణమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. తమ కోచింగ్ స్టాఫ్‌లో అతడిని చేర్చుకునే ఉద్దేశం లేదని పేర్కొంది.

మరోవైపు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గంభీర్ (Gautam Gambhir) వ్యూహాలను విశ్లేషించారు. జట్టులో పార్ట్ టైమ్ ఆల్ రౌండర్లను ఎక్కువగా చేర్చుకోవడం సరికాదని, భారత్‌కు మిడిల్ ఆర్డర్‌లో ఒక పక్కా బ్యాటర్ అవసరమని చెప్పారు. బౌలింగ్‌కు సహకరించే విదేశీ పిచ్‌లపై ఆడటానికి శుబ్‌మన్ గిల్ లాంటి లోతైన సాంకేతికత ఉన్న ఆటగాడు జట్టుకు ఎంతో అవసరమని, భవిష్యత్తులో అతడిని తిరిగి టీ20ల్లోకి తీసుకురావాలని సూచించారు. ఈ ఓటమిని పక్కన పెట్టి, జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న తదుపరి టీ20 సిరీస్‌పై టీమిండియా ఇప్పుడు దృష్టి సారించింది. ఈ సిరీస్‌లో జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>