వరద కాలువలో ఉన్నవి కాళేశ్వరం నీళ్లే : హరీష్‌ రావు

కలం, వెబ్ డెస్క్ : గంగాధర మండలం కురిక్యాల వద్ద ఉన్న వరద కాలువలో ఉన్నవి కాళేశ్వరం నీళ్లే అని మాజీ మంత్రి హరీష్‌ రావు (Harish Rao) అన్నారు. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కాలువల్లోని నీళ్లు కాళేశ్వరం నుంచి వచ్చినవే అన్నారు హరీష్. తాజాగా కురిక్యాల వరద కాలువను హరీష్‌ రావు బీఆర్ ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం (Kaleshwaram) నీళ్లపై సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు. కాలువల్లో పారేవన్నీ కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం నీళ్లు వాడుతూ.. ఒక్క చుక్క ఎత్తిపోయకున్నా దేశంలోనే అత్యధిక వరి తెలంగాణలో పండిందని రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారు’ అని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాలేశ్వరం అంటే కేవలం పిల్లర్లు మాత్రమే కాదని.. మూడు బ్యారేజీలు, వంద కాంపోనెంట్లు అని హరీష్‌ (Harish Rao) చెప్పారు. కాళేశ్వరం కింద తెలంగాణలో పసిడి పంటలు పండుతున్నాయని, ఆ విషయాలను దాచిపెట్టి రేవంత్ అబద్దాలు ఆడుతున్నారంటూ హరీష్ ఫైర్ అయ్యారు. ‘బీఆర్ ఎస్ మీద పగబట్టిన రేవంత్.. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకున్నా పంటలు పండుతున్నాయంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ ఎస్ (BRS) పార్టీని బద్నాం చేయడానికే ఇలాంటి లేనిపోనివి చెబుతున్నారు. బీఆర్ ఎస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తి చేశాం. మిడ్ మానేరుకు అంతకు ముందున్న కాంగ్రెస్ చారణ వంతు పనులు కూడా చేయలేదు. మా హయాంలోనే కంప్లీట్ చేశాం. వరద కాలువలను పునరుజ్జీవన పథకం కింద రూ.2వేల కోట్లతో పూర్తి చేశాం. గౌరవెల్లిని 96 శాతం పనులు చేశాం. కానీ రేవంత్ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. బీఆర్ ఎస్ హయాంలోనే 80 శాతం ప్రాజెక్టులను కంప్లీట్ చేశాం. గౌరవెల్లి ప్రాజెక్టులో మిగిలిన 4 శాతం పనులు కూడా కంప్లీట్ చేయట్లేదు ఇప్పటి కాంగ్రెస్. సీఎంకు అవతలి వారిని తిట్టడం మీదున్న శ్రద్ధ రైతులు, ప్రజల మీద లేదు. 99 రోజుల ప్రణాళికతో ఏం ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరకు వెళ్తున్నావు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఏం చేశారని చెప్తారు’ అంటూ సీఎంపై హరీష్‌ మండిపడ్డారు.

Read Also: జీవితం మళ్లీ రాదు.. యువత మారండి : ఏసీపీ ప్రశాంత్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>