విద్యార్థినులకు వేధింపులు.. పీఈటీపై పోక్సో కేసు

కలం, ఖమ్మం బ్యూరో: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే వికృత చేష్టలకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుడిమల్ల (Gudimalla) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా (పీఈటీ) బాధ్యతలు నిర్వహిస్తున్న షఫీక్ అహ్మద్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం అతడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం పీఈటీని అరెస్ట్ చేశారరు. న్యాయస్థానంలో హాజరుపరిచి, కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

16 మందిపై వేధింపులు..

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దివాకర తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. డీఈవో సూచనలతో అర్బన్ ఎంఈవో పుష్పలత రాణి, జీసీడీవో రూబీతో కూడిన అధికారుల బృందం పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించింది. 16 మంది విద్యార్థినులను పీఈటీ వేధించినట్లు గుర్తించి, వారి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. తల్లిదండ్రుల నుంచి కూడా వివరాలు సేకరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతకు చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. సమగ్ర నివేదికను రూపొందించి కలెక్టర్‌కు అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>