Mobile Popup Ad
Mobile Popup Ad

విజయవాడ యాసిడ్ ఘటనలో టీచర్, ఆయా డిస్మిస్

కలం, వెబ్ డెస్క్ : విజయవాడలో (Vijayawada) చిన్నారిపై జరిగిన యాసిడ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో తాజాగా టీచర్, ఆయా మంగమ్మను విధుల నుంచి డీఈవో ఆదేశాలతో ఉన్నతాధికారులు తొలగించారు. టీచర్, ఆయా విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు గుర్తించారు. స్కూల్ ప్రిన్సిపల్ స్టేట్ మెంట్ ను డీఈవో రికార్డు చేసి విద్యాశాఖకు పంపించారు.

అసలేం జరిగిందంటే..?

విజయవాడలోని (Vijayawada) విద్యాధరపురం నేషనల్ స్కూల్ లో చదువుతున్న మూడేళ్ల చిన్నారి బాత్రూమ్ లో జారిపడింది అంటూ క్లాస్ టీచర్ ఫోన్ చేసి పేరెంట్స్ కు చెప్పాడు. దీంతో పాప తల్లి వెంటనే స్కూల్ కు వచ్చి పాపను ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు.. పాపపై యాసిడ్ దాడి జరిగిందని చెప్పారు. పాప ప్రైవేట్ పార్ట్స్ కు తీవ్రంగా గాయాలు అయ్యాయని స్పష్టం చేశారు. దీంతో పేరెంట్స్ స్కూల్ ప్రిన్సిపల్ ను నిలదీయగా.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించారంటూ పాప పేరెంట్స్ ఆరోపించారు. క్లాస్ టీచరే యాసిడ్ దాడి చేశాడంటూ ఆరోపించారు పేరెంట్స్. ఈ ఘటన పెద్ద ఎత్తున విమర్శలకు తావు తీయడంతో.. అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పాప తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Read Also: తల్లిని మోసం చేసి ఆస్తి రాయించుకున్న కన్న కూతురు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>