26 లక్షల ఉద్యోగానికి గుడ్‌బై.. యువకుడి పోస్ట్ వైరల్!

కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పుష్కర్‌కు (వెబ్‌సైట్ డిజైనర్) ఏడాదికి రూ. 26 లక్షల వేతనంతో ఉద్యోగం లభించింది. మొదటి రోజే జాబ్‌ను వదులుకుని అందరినీ ఆశ్చర్యపర్చాడు. నెలకు సుమారు రూ. 2.1 లక్షల జీతం వచ్చే ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరడం కంటే.. తన మనసుకు నచ్చినట్టుగా ఫ్రీలాన్సింగ్ వైపు సాగడమే మేలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన నిర్ణయం పట్ల గర్వంగా ఉన్నప్పటికీ కొంత ఆందోళనగా కూడా ఉందని పేర్కొన్నాడు.

తన నేపథ్యం దృష్ట్యా ఇది చాలా కష్టమైన నిర్ణయమని పుష్కర్ వివరించాడు. నెలకు రూ. 20-30 వేలు సంపాదించడమే గొప్పగా భావించే గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన తనకు, ఇంతటి భారీ ఆఫర్‌ను కాదనుకోవడం సాహసమేనని తెలిపాడు. ఉద్యోగంలో చేరి ఉంటే ప్రతిరోజూ ఏదో కోల్పోయినట్లు ఫీల్ అయ్యేవాడినని, అందుకే ఆ ‘బందీ’ జీవితం (Life) కంటే ఫ్రీలాన్సింగ్ మెరుగని భావించినట్లు ఆయన రాసుకొచ్చాడు.

ప్రస్తుతం తన మనసులో అనేక ఆలోచనలున్నాయని, మంచి అవకాశాన్ని వదులుకుని తప్పు చేశానా అన్న సందేహం కూడా వేధిస్తోందని పుష్కర్ వెల్లడించాడు. ఫ్రీలాన్సింగ్‌లో ఆదాయం స్థిరంగా ఉండదని తెలిసినప్పటికీ, తన స్వతంత్రత కోసం ఈ రిస్క్ తీసుకున్నట్లు చెప్పాడు. ‘‘ఈ నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

Read Also: మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గ్యాస్ సిలిండర్లు : విజయ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>