Mobile Popup Ad
Mobile Popup Ad

తల్లిని మోసం చేసి ఆస్తి రాయించుకున్న కన్న కూతురు

కలం, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur) జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు (Nidamarru) గ్రామంలో కన్న కూతురు, తల్లిని మోసం చేసి ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వృద్ధురాలు పాములపాటి ఆదిలక్ష్మిని ఎంతో నమ్మకంతో ఉంటూ ఆమె చిన్న కుమార్తె, అల్లుడు మోసం చేసి ఆస్తిని తమ పేర్లపై రిజిస్టర్ చేయించుకున్నారు.

ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగాక, వృద్ధురాలను ఇంటి నుండి బయటకు పంపించేశారు. దీనితో ఆ వృద్ధురాలు మంగళగిరి (Mangalagiri) రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుడు సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు, బాధితురాలికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: ఇరాన్ నౌక విషయంలో మాది సరైన నిర్ణయమే : భారత్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>