కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగే టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) ఫైనల్‌లో గెలుస్తామని.. ట్రోఫీ మాదే అంటున్నారు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner). గత దశాబ్ద కాలంగా ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో కివీస్ జట్టు నిలకడగా రాణిస్తోంది. 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచినప్పటికీ.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 2000 ఏడాది తర్వాత ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు ముందు మాట్లాడిన సాంట్నర్, తమ జట్టు ఫేవరెట్ కాకపోయినా మంచి ప్రదర్శన ఇస్తే కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ జట్టు ఎప్పుడూ ప్రత్యర్థులను చూసి భయపడదని, ఒక యూనిట్‌గా ఆడి నిలకడను చాటుకుంటామని ఆయన (Mitchell Santner) తెలిపారు. ఈసారి కూడా అదే పంథాను కొనసాగిస్తామన్నారు. గతంలో 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2021 టీ20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో కివీస్ ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం “మంచి జట్టు” అని పేరు తెచ్చుకోవడం కంటే, ఈసారి ట్రోఫీ గెలవడంపైనే దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు.
Read Also: ఇదీ ఇల్లందు సత్తా.. నిన్న సివిల్స్ , నేడు గద్దర్ అవార్డ్
Follow Us On: X(Twitter)

