పేదల ఇండ్లు కూలిస్తే పరామర్శించే హక్కు లేదా? ఎమ్మెల్సీ తాత మధు

కలం, ఖమ్మం బ్యూరో: పేదల గుడిసెలను కూలిస్తే పరామర్శించే హక్కు తనకు లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ (Tata Madhusudhan) ప్రశ్నించారు. ఖమ్మం (Khammam) కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇండ్లు కూల్చివేశారని, తాను బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ఘటనా స్థలానికి వెళ్లకుండానే అడ్డుకున్నారని, కేవలం బాధితులతో మాట్లాడి వస్తానని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. లా అండ్ ఆర్డర్ పేరుతో తనను వెనక్కి పంపారని తాతా మధుసూదన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, జిల్లాలోని (Khammam) వెలుగుమట్ల (Velugumatla) గ్రామంలో పేదల ఇండ్ల కూల్చివేత ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వ భూములపై ఆక్రమణగా గుర్తించిన కొన్ని గృహాలను అధికారులు కూల్చివేశాయి. ముందస్తు నోటీసులు లేకుండా ఈ చర్యలు చేపట్టారని కొన్ని కుటుంబాలు ఆరోపించాయి. తమకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని, పునరావాసం ఏర్పాటు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also: అలర్ట్.. మార్చిలో బ్యాంకులకు వరుస సెలవులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>