భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు దుర్మరణం!

కలం, భైంసా: భైంసా (Bhainsa) పట్టణంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణంలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ సమీపంలో బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో గోకుల్ నగర్‌ కాలనీకి చెందిన నగేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఎదురుగా వచ్చిన బస్సు బైక్‌ను బలంగా ఢీకొనడంతో నగేష్ రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాద తీవ్రతకు బైక్ బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోగా, బస్సు అద్దం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకుడి మృతితో గోకుల్ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>