తిరుపతిలో భారీ చిప్ పార్క్.. లోకేశ్ కీలక ప్రకటన

కలం, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) మరో ముందడుగు వేశారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సెమీకండక్టర్ అండ్ డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0’ ను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ కొత్త పాలసీ ద్వారా సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలకు 80 శాతం వరకు మూలధన సాయం అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ISM Semicon 2.0 పథకం కింద లభించే ప్రోత్సాహకాలకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం మ్యాచింగ్ సపోర్ట్ ఇవ్వనుంది.

మరోవైపు తిరుపతిలో 5,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక సెమీకండక్టర్ పార్కును (Semiconductor Park) ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కు ద్వారా అంతర్జాతీయ స్థాయి చిప్ తయారీ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త పాలసీతో ఏపీలో సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ రంగాలకు పెట్టుబడుల మార్గం సుగమం కానుంది. దేశంలో చిప్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను కీలక గమ్యస్థానంగా నిలబెట్టడమే ఈ విధానం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>