అబ్దుల్ హాదీ మృతిపై డీకే అరుణ సంతాపం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా ఏఐఎంఐఎం అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హాదీ(Mohammed Abdul Hadi) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna)  శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని మదీనా మసీదు సమీపంలోని అబ్దుల్ హాదీ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అబ్దుల్ హాదీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. అబ్దుల్ హాదీ మృతి తీరని లోటని డీకే అరుణ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి అబ్దుల్ హాదీ కృషి చేసేవారని ఆమె గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, అందరికీ అందుబాటులో ఉండేవారని కొనియాడారు. రాజకీయంగా పార్టీలు వేరైనా అన్ని వర్గాల వారితో ఆయన సత్సంబంధాలు కొనసాగించేవారని డీకే అరుణ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>