వినాయక ఉత్సవాలపై ఎమ్మెల్యే ధన్‌పాల్ పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో: వినాయక మండపాల నిర్వాహకులు, యువత ఉత్సవాలను భక్తిభావంతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని నిజామాబాద్ (Nizamabad) అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal))అన్నారు. శ్రీ ధన్‌పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని మార్వాడి గల్లీలో ఉన్న కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు యువత భక్తి మార్గంలో నడవాలని సూచించారు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. ప్రతి ఏడాది తమ ట్రస్ట్ ద్వారా ఉత్సవ నిర్వాహకులకు సహకారం అందిస్తున్నామని, గత ఏడాది 725 వినాయక మండపాలకు సహాయం అందించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా సహాయం కోసం వచ్చిన వారికి తన వంతు సహకారం అందిస్తామని చెప్పారు.

వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు మాత్రమే కాదని, సంస్కృతి, సనాతన ధర్మం, ఐక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వినాయకుడిని పూజించడం ద్వారా విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని అన్నారు. ఇంటింటా గణపతి పూజకు ఎంతోకాలంగా సంప్రదాయం ఉన్నప్పటికీ, సామూహిక వినాయక ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్ ప్రోత్సహించారని గుర్తుచేశారు. సామూహిక ఉత్సవాల ద్వారా ప్రజలు ఒకచోట చేరి ఐక్యతను పెంపొందించుకునే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. వినాయక ఉత్సవ నిర్వాహకులకు సహాయం అందించే కార్యక్రమం శనివారం కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>