అవినీతిపై ఉక్కుపాదం.. అధికారులకు సీఎం విజయ్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) పాలనపై పట్టు సాధించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం ఇప్పటికే పలు కీలక పథకాలకు శ్రీకారం చుట్టిన విజయ్, తాజాగా అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ప్రభుత్వ యంత్రాంగంలో లంచగొండితనానికి చెక్ పెట్టేందుకు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాష్ట్రంలో అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులకు సీఎం విజయ్ తనదైన శైలిలో గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ప్రజలు భయపడకుండా  అధికారుల పేర్లను నేరుగా తన వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని స్పష్టం చేశారు. ‘లంచం అడిగే అధికారుల వివరాలను నాకు నేరుగా వాట్సాప్ ద్వారా పంపండి, మిగతా చర్యలు ఏంటో నేను చూసుకుంటాను’ అని సీఎం తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>