Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం హోదాలో.. తొలిసారి అసెంబ్లీకి విజయ్

కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎంగా నిన్న బాధ్యతలు చేపట్టిన విజయ్ (CM Vijay).. ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ అసెంబ్లీలో సీఎం సీట్లో కూర్చోబోతున్నారు. ప్రొటెం స్పీకర్ కరుప్పయ్య నూతన
ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. ఇక అత్యంత కీలకమైన బల నిరూపణ 13న జరిగే అవకాశం ఉంది.

తొలి రోజు బిజీ బిజీగా సీఎం..

ముఖ్యమంత్రి విజయ్ తొలి రోజు బిజీ బిజీగా గడిపారు. సచివాలయంలో రాష్ట్ర శాంతి భద్రతల ప్రస్తుత పరిస్థితిపై సీఎస్, డీజీపీతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, పెరియార్ స్మారక ప్రాంగణాన్ని సందర్శించి నివాళులర్పించారు. మరికొందరు కీలకమైన ద్రవిడ నేతలను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>