కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ఏపీకి రానున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కాలేజీకి సంబంధించి ఈవెంట్ కోసం విజయ్ కాకినాడ (Kakinada)కు వస్తున్నారని, ఆయకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే విజయ్ పర్యటనపై తమిళనాడు సీఎంవో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ఫ్లెక్సీలు కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (KIET) కాలేజీ పేరిట ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన వీడియోలు ఏపీతో పాటు తమిళనాడులో కూడా వైరల్‌గా మారాయి.
అయితే సదరు కాలేజీ యాజమాన్యం కూడా ఎక్కడా విజయ్‌ని ఆహ్వానించినట్లు అధికారికంగా వెల్లడించలేదు. మరి ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు? అనేది అర్థం కాక స్థానికులు గందరగోళానికి గురవుతున్నారు. అలాగే ఎప్పుడు వస్తారన్నది కూడా అందులో మెన్షన్ చేయలేదు. కేవలం ఇన్ వైటింగ్ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

