కలం, వెబ్ డెస్క్ : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల పరోక్ష ఎన్నిక ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) పరిశీలించారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. కౌన్సిలర్లు తెలుగు అక్షరాల ప్రకారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేపట్టబడ్డాయని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని సూచనలను పాటిస్తారని ఆయన హామీ ఇచ్చారు.


