epaper
Wednesday, February 18, 2026
epaper

డబుల్ సూపర్ ఓవర్.. సౌతాఫ్రికా విక్టరీ

కలం, స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్ కప్‌(T20 World Cup)లో బుధవారం సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరు సాగింది. మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఆ సూపర్ ఓవర్ కూడా టై అవడంతో రెండో సూపర్ ఓవర్ కు వెళ్లింది. ఇలా డబుల్ సూపర్ ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది. అనంతరం అఫ్గనిస్తాన్ బరిలోకి దిగి19.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 187 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్‌ఓవర్‌లో అఫ్గనిస్తాన్ 17 రన్స్ చేయగా.. సౌతాఫ్రికా ఒక వికెట్ కోల్పోయి 17 రన్స్ చేసింది.

రెండో సూపర్ ఓవర్‌కు ఫలితం వెళ్లడంతో.. రెండో సూపర్‌ఓవర్‌లో మొదట సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు దిగి 23 రన్స్ చేసింది. అనంతరం కేశవ మహరాజ్ బౌలింగ్‌లో అఫ్గనిస్తాన్ 19 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. రెండో సూపర్ ఓవర్‌లో చివరి నాలుగు బంతుల్లో అఫ్గన్ బ్యాట్స్‌మన్ గుర్బాజ్ మూడు సిక్సర్లు కొట్టడంతో మూడో సూపర్ ఓవర్‌కు మ్యాచ్ వెళ్తుందా? అనే సిట్యువేషన్ ఏర్పడింది. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో కెనడాతో గెలిచి రెండు పాయింట్లను సౌతాఫ్రికా సాధించింది. తాజా విజయంతో మరో రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. మొన్న న్యూజిలాండ్ మీద, ఇప్పుడు సౌతాఫ్రికా చేతుల్లో అఫ్గనిస్తాన్ ఓటమిని చవిచూసింది.

మొదటి సూపర్ ఓవర్ ఇలా:

సూపర్ ఓవర్‌లో మొదట అఫ్గనిస్తాన్ బ్యాటింగ్‌కు రాగా.. సౌతాఫ్రికా బౌలింగ్ వేసింది. లుంగి ఎన్‌గిడి బాలింగ్‌లో అఫ్గనిస్తాన్ బ్యాట్స్‌మన్ అజ్మత్ మొదటి‌బాల్‌ను 4గా, రెండో‌బాల్‌ను సిక్సర్‌గా, మూడో‌బాల్‌ను సింగిల్‌గా తీశాడు. గుర్బాజ్ స్ట్రైక్‌లోకి వచ్చి నాల్గో‌బాల్‌ను సింగిల్‌తో సరిపెట్టాడు. మళ్లీ అజ్మత్ స్ట్రైక్‌లోకి వచ్చి ఐదో‌బాల్‌ను బౌండరీగా మలిచాడు. ఆ తర్వాత ఆరో‌బాల్‌ను అజ్మత్ సింగిల్‌తో సరిపెట్టాడు. మొత్తంగా సూపర్ ఓవర్‌లో అఫ్గనిస్తాన్ 17 రన్స్ చేసింది. 18 రన్స్ టార్గెట్ ఛేదనకు సౌతాఫ్రికా బరిలోకి దిగింది. ఫజల్ ఫరూఖీ బాలింగ్‌లో మిల్లర్ ఫస్ట్ బాల్ కు సింగిల్ తీశాడు. బ్రెవిస్ రెండో బాల్‌ను సిక్సర్ గా కొట్టి మూడో బాల్ కు ఔట్ అయ్యాడు. స్టబ్స్ బరిలోకి వచ్చి.. నాల్గో‌బాల్‌ను బౌండరీగా మలిచాడు. ఐదో బాల్ డాట్‌గా మారింది. ఒక్క బాల్ కు 7 రన్స్ కావాల్సి ఉండగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టారు. దీంతో మళ్లీ సూపర్ ఓవర్‌లోకి వెళ్లింది.

రెండో సూపర్ ఓవర్ ఇలా:

మొదట సౌతాఫ్రికా బరిలోకి దిగింది. అజ్మత్ బౌలింగ్ లో మొదటి బాల్ కు స్టబ్స్ సిక్స్ కొట్టాడు. మరో బాల్ సింగిల్‌గా మలిచాడు. మూడో బాల్ ను మిల్లర్ రెండు రన్స్ తీశాడు. నాలుగు, ఐదో బాల్స్ కు రెండు సిక్సర్లు కొట్టాడు. ఆరో బాల్ కు రెండు రన్స్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా స్కోర్ 23.
24 రన్స్ లక్ష్య ఛేదనలో అఫ్గనిస్తాన్ బరిలోకి దిగింది. కేశవ మహరాజ్ బౌలింగ్ లో మొదటి బాల్ డాట్ అయింది. రెండో బాల్‌కు అజ్మత్ ఔటయ్యాడు. నాలుగు బంతుల్లో 24 రన్స్ కావాల్సి ఉండగా.. గుర్బాజ్ రెండు సిక్స్‌లు కొట్టాడు. రెండు బాల్స్‌లో 12 కొట్టాల్సి ఉండగా.. మరో సిక్స్ కొట్టాడు. చివరి బాల్ కు ఆరు రన్స్ చేయాల్సి ఉండగా.. వైడ్ పడింది. దీంతో ఒక్క బాల్‌కు ఐదు రన్స్ చేయాల్సి ఉండగా గుర్బాజ్ ఔటయ్యాడు.

 Read Also: స్కూల్​లో కాల్పులు.. 10 మంది మృతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>