మహిళ మెడపై కత్తి పెట్టి చైన్ స్నాచింగ్‌కు యత్నం.. దొంగకు స్థానికుల దేహశుద్ధి

కలం, వెబ్ డెస్క్ : బంగారు గొలుసు కోసం ఓ దుండగుడు మహిళను కత్తితో బెదిరించి చైన్ స్నాచింగ్‌కు (Chain Snatching) ప్రయత్నించిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) ఇందిరానగర్‌లో వెలుగుచూసింది. మహిళ మెడపై కత్తి పెట్టి భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్ ప్రాంతంలో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో తన వద్ద ఉన్న కత్తితో ఆమెను బెదిరించి, మెడపై కత్తి పెట్టాడు. అనంతరం ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన మహిళ సహాయం కోసం కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని దుండగుడిని చుట్టుముట్టారు. మహిళను అతడి చెర నుంచి రక్షించి, నిందితుడిని పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ప్రభురాజ్‌గా గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>