కలం, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరొకరికి కీలక పదవి దక్కింది. చిరంజీవి కూతురు , సినీ నిర్మాత సుస్మిత కొణిదెల (Sushmita Konidela) విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
సుస్మిత తన పదవిలో భాగంగా ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆయల సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, దసరా నవరాత్రులు వంటి ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో తనవంతు క్రియాశీలక సూచనలు, సేవలు అందిస్తారు. మెగా కుటుంబం నుంచి ఇప్పటీకే పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కొణిదేల నాగబాబు గ్రీన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ చైర్మన్ గా రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవిని పొందారు. అటు తెలంగాణలోని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదేల సురేఖ సేవలు అందిస్తున్నారు. తాజాగా చిరంజీవి కూతురు సుస్మితకు తాజా పోస్టు దక్కడం సినీ, రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

