epaper
Monday, February 23, 2026
epaper

బెంగాల్​లో​ ‘సర్​’ పర్యవేక్షణకు న్యాయ బృందాలు : సుప్రీం

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమ బెంగాల్​లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (West Bengal SIR) ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాలను సమన్వయం చేసుకుంటూ, ‘సర్​’ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూసేందుకు న్యాయ బృందాలను పర్యవేక్షకులుగా నియమించాలని బెంగాల్​ హైకోర్టును ఆదేశించింది. ప్రస్తుతం పదవిలో ఉన్న లేదా మాజీ జిల్లా న్యాయమూర్తులు/అదనపు న్యాయమూర్తుల హోదాలోని న్యాయాధికారులను ఈ ప్రక్రియకు నియమించాలని చెప్పింది. ఈ బృందాలు ఓటరు జాబితాలోని మార్పులు, చేర్పులపై అభ్యంతరాలను పరిశీలించి, విచారణ జరిపి, పరిష్కరించాలని పేర్కొంది.

ఈ ప్రక్రియను వేగంగా, ఈ నెల 28లోపు పూర్తయ్యేలా చూడాలని సుప్రీం చెప్పింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్​లు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలని ఆదేశించింది. ఈ సమావేశం అడ్వొకేట్​ జనరల్​, సొలిసిటర్​ జనరల్​ సమక్షంలో జరగాలని తెలిపింది. అలాగే, షెడ్యూల్​ ప్రకారం ఈ నెల 21న విడుదలయ్యే డ్రాఫ్ట్​ లేదా తుది ఓటరు జాబితాను ఫైనల్​గా పరిగణించవద్దని సూచించింది. అవసరమైతే, న్యాయ బృందాల విచారణ తర్వాత ఎన్నికల కమిషన్​ అదనపు జాబితాను విడుదల చేయవచ్చని పేర్కొంది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది(West Bengal SIR). ‘ రెండు రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య ఓటరు జాబితా విషయమై ఆరోపణలు, నిందలు రావడం దురదృష్టకరం. ఇది రెండిటి మధ్య అపనమ్మకాన్ని సూచిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. కాగా, బెంగాల్​లో ‘సర్​’ వివాదంపై నమోదైన పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ జోయ్​మాల్యా బాగ్చీ, విపుల్​ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>