కలం, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టులో (Supreme Court) SIR ప్రక్రియ రద్దుపై కేంద్ర ఎన్నికల కమీషన్ పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) వేసిన పిటిషన్ విచారణ జరిగింది. ఈ విచారణలో మమతా బెనర్జీ స్వయంగా న్యాయవాదిగా మారి తన వాదనలు వినిపించారు. అసోంలో ఎందుకు ఓట్లను తొలగించడం లేదు. ఇక్కడ మాత్రం బీఎల్వోలపై ఒత్తిడి తెచ్చి ఓట్లను తొలగిస్తున్నారు. ఈ విషయంపై ఈసీకి ఆరుసార్లు లేఖ రాసిన పట్టించుకోలేదు. SIR కారణంగా బెంగాల్ లో వందమంది చనిపోయారు. సుప్రీంకోర్టులో అయినా మాకు న్యాయం జరగాలని మమతా వాదించారు. మమత అభ్యర్థనతో సుప్రీంకోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది.
Read Also: యూపీలో దారుణం.. ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు ముగ్గురు బాలికల ఆత్మహత్య
Follow Us On : WhatsApp


