సైబర్ బాధితులకు రిలీఫ్​.. బ్యాంకులదే బాధ్యత!

కలం, వెబ్ డెస్క్: సైబర్ బాధితులకు సుప్రీం కోర్టు (Supreme Court) ఊరట కల్పించింది. డిజిటల్ మోసాల్లో బాధితులు కోల్పోయిన డబ్బులకు బ్యాంకులే బాధ్యత వహించేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేగాకుండా అకౌంట్లలో అసాధారణ లావాదేవీలు జరుగుతుంటే వెంటనే పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేసే బాధ్యత కూడా బ్యాంకులదే అని తేల్చి చెప్పింది. ఒక్క ఏడాదిలోనే రూ.800 కోట్ల సైబర్ మోసాలు (Cyber Fraud) జరగడంపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ నేరాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని.. ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా దిశానిర్దేశం చేసింది. సైబర్ నేరాలు సమాజానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించింది.

ఆర్బీఐకి కీలక ఆదేశాలు..

డిసెంబర్ 31 నుంచి ఆర్బీఐ కొత్త కేవైసీ నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుసుకున్న ధర్మాసనం.. ఆ మార్గదర్శకాలు వర్తించే బ్యాంకులు ఏవో తమకు జాబితా రూపంలో సమర్పించాలని ఆదేశించింది. సైబర్ నేరాల శాతం తగ్గుతున్నా.. ప్రజలు కోల్పోతున్న డబ్బుల విలువ పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశమని స్పష్టం చేసింది. సుమారు 9,400 అనుమానిత ఖాతాలను తాము బ్లాక్ చేశామని వాట్సాప్ సంస్థ ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు(Supreme Court)కు వివరించింది.

Also Read : పార్లమెంట్​‌ను రద్దు చేయాలి : మల్లికార్జున ఖర్గే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>