పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలతో భరోసా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కలం, జన్నారం: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. జన్నారం (Jannaram) మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని తెలిపారు. డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సంక్షేమం, రైతుల అభ్యున్నతి, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ అల్లం రవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>