ఏపీ హై కోర్టులో అయిదుగురు జడ్జిలు నియామకం

కలం, వెబ్ డెస్క్: ఏపీ హై కోర్టు (AP High Court)లో అయిదుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు, జస్టిస్ మహేశ్వరరావు కుంచంను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది.

అయిదుగురు జడ్జిల పనితీరు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సంబంధించిన ఫైల్‌ను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించారు. అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన వెంటనే.. గెజిట్ నోటిఫికేషన్ జారీ కానుంది. ఆ రోజు నుంచి అయిదుగురు జడ్జిల నియామకం వెంటనే అమల్లోకి వస్తుంది. హై కోర్టులో శాశ్వత జడ్జిల నియామకంతో కేసుల భారం కొంత తగ్గనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>