కలం, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 7, 8 తేదీల్లో ధ్రువీకరించిన గ్రీన్ క్రాకర్స్ (Green Firecrackers) కాల్చేందుకు మాత్రమే అనుమతించింది. ఈ రెండు రోజుల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చాలని స్పష్టం చేసింది.
అదేవిధంగా ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, ఆరోగ్య కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, నోటిఫై చేసిన నిశ్శబ్ద ప్రాంతాలకు 300 మీటర్ల పరిధిలో బాణసంచా కాల్చడాన్ని నిషేధించింది. విద్యాసంస్థల పరిసరాలను కూడా బాణసంచా రహిత ప్రాంతాలుగా ప్రకటించాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు విధించింది.
Also Read : తెలంగాణలో కాంగ్రెస్‌ను ఓడించాలి: అమిత్ షా
Follow Us On : WhatsApp

