ఎంజీ యూనివర్సిటీ పీజీ రిజల్ట్స్ రిలీజ్.. ఉత్తీర్ణత శాతం ఎంతంటే!

కలం, నల్లగొండ బ్యూరో: మహాత్మా గాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) పరిధిలోని పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలను (PG Results) వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 10,92 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 821 మంది ఉత్తీర్ణత సాధించగా, 24 మంది ప్రమోట్ అయ్యారు. 246 మంది వివిధ సబ్జెక్టుల్లో అనుతీర్ణులయ్యారు. ఫలితాల పూర్తి వివరాలు ఎంజీయూ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజి రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి, పర్సనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంధ్యారాణి, లక్ష్మీప్రభ, ప్రవళిక, కళ్యాణి, భిక్షమయ్య పాల్గొన్నారు.

Read Also: పద్మ అవార్డులు-2027.. కేంద్రం కీలక ప్రకటన

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>