కలం సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది. ఆతర్వాత జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేయనున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే.. కథ ఏంటి..? ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది..? అనేది క్లారిటీ లేదు. కాకపోతే.. ఇప్పుడ ఈ క్రేజీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటది..?
చరణ్ ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత చేస్తోన్న పెద్ది పాన్ ఇండియా మూవీ. అయితే.. సుకుమార్ చరణ్ కోసం పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం కథ పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. యూనివర్శిల్ అప్పీల్ ఉండే ఓ స్టోరీ లైన్ పై గత కొంతకాలంగా వర్క్ చేస్తున్నారట. అయితే.. ఇంకా హీరో చరణ్ కి స్టోరీ నెరేట్ చేయలేదని.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత నెరేట్ చేస్తారని తెలిసింది. పెద్ది సినిమా రిలీజ్ తర్వాత సుక్కు సినిమా సెట్స్ పైకి వస్తుందని సమాచారం.
సుకుమార్ (Sukumar).. స్టోరీ విషయంలో కాంప్రమైజ్ కారు. తన టీమ్ తో కలిసి ఒక వెర్షెన్ కాదు.. రకరకాల వెర్షెన్స్ రెడీ చేయిస్తారు. అందరూ ఇచ్చిన వెర్షెన్స్ లోంచి ఆయన మరో వెర్షెన్ రాసుకుంటారు. ఇలా పేపర్ పై బాగా కసరత్తు చేస్తారు. అందుకనే ఆయన సినిమాల కథలు అంత బాగుంటాయి. ఆమధ్య రంగస్థలం 2 చేస్తారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయితే.. అలాంటిది ఏమీ లేదని.. అది గాసిప్ అని తెలిసింది. ఈసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ కాకుండా స్టైలీష్ గా ఉండే యూనివర్శిల్ అప్పీల్ ఉన్న స్క్రిప్ట్ తోనే సినిమా చేయబోతున్నారట సుకుమార్. రంగస్థలంలో చిట్టిబాబు పాత్రతో చరణ్ లో ఉన్న నటుడ్ని బయటకు తీసుకువచ్చారు.. మరి.. ఈసారి చరణ్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి.


