కలం, వెబ్ డెస్క్: ఇసుక, నల్లరాయి లాంటి ఖనిజాల అక్రమ తవ్వకం, అమ్మకాలకు సంబంధించి ఒడిశా (Odisha)లోని గంజాంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.2.5 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్న బ్రోకర్లు, నేరస్థులు గ్యాంగ్‌స్టర్లతో సహా ఇతర వ్యక్తులతో సంబంధం ఉన్నవారి ఇండ్లలో దాడులు చేసింది.
కోట్లాది రూపాయల నగదుతో నిండిన అల్మారా, ఖరీదైన వాహనాలు, స్థిరాస్తుల పత్రాలు, మైనింగ్ లీజుల పత్రాలను అధికారులు గుర్తించారు. అక్రమ ఇసుక తవ్వకం, ఇసుక మాఫియాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ED దాడులకు దిగింది. అక్రమ మైనింగ్ (Mining)తో దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఈడీ ఆరోపించింది. అక్రమ మైనింగ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


