కలం వెబ్ డెస్క్ : ఇరాన్(Iran)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలువురు భారతీయులు(Indians) ఇరాన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. శుక్రవారం రాత్రి వీరంతా ఢిల్లీ(Delhi) ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇరాన్‌లో పరిస్థితులు బాగా లేవని, అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడున్న పలువురు స్వదేశానికి తిరిగివచ్చారు. ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ జాగ్రత్తలు తీసుకుంటుందని, ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. భారతీయులకు ఏవైనా సమస్యలు ఎదురైతే ఇండియన్ ఎంబసీలో సంప్రదించాలని సూచించారు. స్థానికంగా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరస్థితుల్లో అక్కడ ఉండటం కంటే స్వదేశానికి రావడమే మేలు అని కొందరు తిరిగి వచ్చేశారు. ఇరాన్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. నిరసనకారులు రోడ్ల మీద తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. పౌరులకు ఇంటర్నెట్ పూర్తిగా నిలిపివేశారు. ఇప్పట్లో ఎవరూ ఇరాన్‌కు ప్రయాణం చేయవద్దని కేంద్రం హెచ్చరించింది.


