రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం : నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Narender Reddy) అన్నారు. ఎలగందుల (Elagandula), ఆసిఫ్ నగర్ (Asif Nagar) వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన నరేందర్ రెడ్డి (Narender Reddy), గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు సమయంలో తాలు పేరుతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఆయన తెలిపారు. టార్పాలిన్లు, కాంటాలు, ధాన్యం రవాణా వంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం సుధారాణి, ఎపిఎం భువన్ చంద్ర, ఎలగందుల సర్పంచ్ నిమ్మల అంజయ్య, పంజాల స్వామి గౌడ్, ఉప సర్పంచ్ గసికంటి కుమార్, అరె మల్లేశం, గుండ మల్లేశం, కాడె ప్రశాంత్, ఆసిఫ్ నగర్ సర్పంచ్ ఆంజనేయులు, ఓరుగంటి చంద్రయ్య, దుర్గం అంజయ్య, దావ ప్రభాకర్, దుర్గం పరశురాం, సిసి లు కరుణాకర్, ప్రియదర్శిని, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>