Mobile Popup Ad
Mobile Popup Ad

పుచ్చకాయ తిన్నాక నలుగురు మృతి.. పెద్ద మిస్టరీ

కలం, వెబ్ డెస్క్: ముంబయిలో భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెల మృతి మిస్టరీగా (Death Mystery)  మారింది. అబ్దుల్లా డొకాడియా తన భార్య నస్రీన్, ఇద్దరు కుమార్తెలతో కలిసి పైధుని ప్రాంతంలో ఉంటున్నాడు. గత శనివారం బంధువులను ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించారు. అంతా కలిసి సరదాగా భోజనం చేశారు. రాత్రి 10.30 గంటలకు వచ్చిన బంధువులు తిరిగి వెళ్లిపోయారు.

పుచ్చకాయలో ఏమైనా విషం..?

బంధువులు వెళ్లిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పుచ్చకాయ తిన్నట్లు అక్కడ లభించిన ఆధారంగా తెలుస్తోంది. తిన్న కాసేపటికే వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో, ఇరుగు పొరుగు వారు స్పందించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నలుగురు చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పుచ్చకాయ శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తేనే.. నలుగురు మరణాలకు కారణం తెలుస్తుందని చెబుతున్నారు. ఆ రోజు వాళ్ల ఇంటికి వచ్చిన బంధువులను సైతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>