కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar)లోని కిసాన్ నగర్ 29వ డివిజన్‌లో సీసీ రోడ్డు పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) శంకుస్థాపన చేశారు. సుడా రెండేళ్ల ప్రగతి పక్షోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రజల కోరిక మేరకు 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని నరేందర్ రెడ్డి అన్నారు.అంతర్గత రోడ్లు గుంతలమయమై ప్రజలు ఇబ్బంది పడుతున్నందున రోడ్లను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఈ రెండేళ్లలో అనేక రోడ్లను అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో ఇంకా అవసరమైన చోట తప్పకుండా అభివృద్ధి పనులు చేపడుతామని నరేందర్ రెడ్డి (Komatireddy Narender) వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఏఈ సతీష్, సోమిడి వేణు ప్రసాద్, కాంపెల్లి కీర్తి కుమార్, కుర్ర పోచయ్య, తోట అంజయ్య, మంద మహేష్, మేరాజ్, అశోక్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఏన్కూర్ శివార్లలో భారీగా ఎక్స్పైరీ కూల్డ్రింక్స్, వాటర్ బాటిళ్లు!
Follow Us On : WhatsApp

