కలం, నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియా (Haliya) పట్టణంలో వైద్య రంగంలో మరో ముందడుగు పడింది. నిర్మల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆధునిక వైద్య సదుపాయాలతో మోకాలి శస్త్రచికిత్సను(Knee Surgery) విజయవంతంగా నిర్వహించారు. మోకాలి సమస్యతో బాధపడుతున్న ఓ రోగి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లగా, శస్త్రచికిత్సకు సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం హాలియాలోని నిర్మలా హాస్పిటల్‌ను సంప్రదించగా, తక్కువ ఖర్చుతోనే చికిత్స అందించారు. అమెరికా నుంచి దిగుమతి చేసిన కృత్రిమ మోకాలి చిప్పను ఉపయోగించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
నిర్మల హాస్పిటల్ యాజమాన్యం ఆధునిక వైద్య సదుపాయాలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగా మోకాలి శస్త్రచికిత్సను హాలియాలోనే విజయవంతంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఇప్పటివరకు మోకాలి శస్త్రచికిత్సల కోసం హైదరాబాద్, విజయవాడ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, హాలియాలోనే ఈ తరహా చికిత్సలు అందుబాటులోకి రావడం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. నిర్మల హాస్పిటల్‌లో మోకాలి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
స్థానికులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
హాలియా ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నిర్మల హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొంది. హాలియా ప్రాంత వైద్య రంగంలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.

