గాంధీజీ ఆశయాలను మనమంతా నెరవేరుద్దాం: అదనపు కలెక్టర్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గాంధీజీ సిద్ధాంతాలను, ఆశయాలను నెరవేర్చేందుకు మనమంతా ఐక్యంగా కలిసి ముందుకు రావాలని, జిల్లా స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ (Madhusudhan Naik) మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, సహనం, శాంతి, మానవతా విలువలు మానవాళికి ఎంతో అవసరమని అన్నారు. గాంధీజీ ఆశయాలను, విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌‌ఓ ఎ. నిర్మల, ఏఓ సువర్ణరాజ్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>