Mobile Popup Ad
Mobile Popup Ad

విద్యా సంస్థల బంద్‌ విజయవంతం చేయండి

కలం, నిజామాబాద్ బ్యూరో: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 10వ‌ తేదీన జరిగే కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్‌ (Education Bandh)ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు (SFI -AISF-PDSU -AIFDS – PDSU -AIPSU డిమాండ్ చేశాయి. ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ (Nizamabad) నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. విద్యాశాఖకు ఇప్పటి వరకు మంత్రిని కేటాయించలేదని విమ‌ర్శించారు. 24 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదింపు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్య వ్యాపారాన్ని అరికట్టడానికి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ నిధులు రూ.9,000 కోట్లను విడుదల చేయాలని, అద్దె భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలకు హాస్టల్స్, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకాలంలో యూనిఫామ్స్ పుస్తకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు యూనిఫామ్స్‌, నోటుబుక్‌ల‌ విక్రయాల కేంద్రాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.

యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెస‌ర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు డా.కర్క గణేష్, ఏఐఎఫ్‌డీఎస్ వినోద్, ఏఐపిఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ అనిల్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మనోజ్, శ్రీకర్, రాజు, కిషోర్, నీరజ్, శివ, ఆశుర్, సునీల్, సూర్యాపాల్, పవన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>