మొరంపల్లి బంజర్ లో ఈదురుగాలుల బీభత్సం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర్ (Morampalli Banjar) గ్రామంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బుధవారం వీచిన బలమైన ఈదురు గాలులకు గ్రామంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ​గాలుల ధాటికి పలుచోట్ల భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ వైర్లు నేరుగా ఇళ్లపై పడటంతో పలు నివాసాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెగిపడిన కరెంట్ తీగలతో ప్రమాదాలు పొంచి ఉండటంతో గ్రామంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో గ్రామం మొత్తం అంధకారంలో అల్లాడుతోంది.

​తెగిపడిన తీగలు, కూలిన స్తంభాల పట్ల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితి నెలకొన్నందున ప్రజలు, ముఖ్యంగా పిల్లలు విద్యుత్ స్తంభాలు, వైర్ల సమీపంలోకి వెళ్లవద్దని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ​సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లపై, ఇళ్లపై పడిన చెట్లను తొలగించాలని, విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే, గాలుల తీవ్రతకు నష్టపోయిన కుటుంబాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగిన పరిహారంతో తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>