పాలిటెక్నిక్ విలీనంపై సిబ్బంది గరం

కలం, స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల(Polytechnic Colleges)ను విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ  మంగళవారంస్టేషన్‌ఘన్‌పూర్ (Station Ghanpur) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది నిరసన (Polytechnic Staff Protest) చేపట్టారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రాంగణంలో నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు గ్రామీణ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో కీలకంగా ఉన్నాయని సిబ్బంది పేర్కొన్నారు. కళాశాలల విలీనంతో విద్యార్థుల విద్యా అవకాశాలు, సాంకేతిక విద్యపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం విలీన ప్రతిపాదనపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. “విలీనం కాదు.. సాంకేతిక విద్య బలోపేతం కావాలి” అంటూ నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మౌలిక వసతులు, సిబ్బంది, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నిరసనలో కళాశాల ప్రిన్సిపాల్ గంగారెడ్డి, హెచ్‌ఓహెచ్‌ఎస్‌ టి.అశోక్, టీపీజేఏసీ ప్రతినిధి సుధర్శన్‌రెడ్డి, లెక్చరర్లు ధనుంజయ్, సంపత్‌కుమార్, శ్రీకర్, సుకన్య, అనిల్‌కుమార్, కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు నరేష్‌కుమార్, జితేందర్, ప్రశాంత్‌తో పాటు క్లాస్‌-4 సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>