బడికి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో.. బోడంగిపర్తి విద్యార్థుల గోడు!

కలం, మునుగోడు (చండూరు): గ్రామీణ ప్రాంత ప్రజలకు రహణ సౌకర్యార్థం కోసం మహాలక్ష్మి పథకం కింద పల్లె వెలుగు బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కానీ నేడు పలు పల్లెల్లో, మారుమూల గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు లేకపోవడం శోచనీయం. ఈ కోవలోనే బోడంగిపర్తి (Bodangiparthy) పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ “కలం” ప్రత్యేక కథనం అందిస్తోంది.

చండూరు (Chandur) మండల పరిధిలోని వివిధ గ్రామాల విద్యార్థులు బోడంగిపర్తి (Bodangiparthy) పాఠశాలకు వందల సంఖ్యలో విద్యార్థులు ఆటోలలో భయం భయంతో ప్రయాణిస్తారు. ఎన్నోసార్లు ఆర్టీసీ అధికారులకు ఈ సమస్యను విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని వివిధ గ్రామాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోడంగిపర్తి పాఠశాలకు నేర్మట, ధోని పాముల, బంగారిగడ్డ, తుమ్మలపల్లి, జోగిగూడెం, తిమ్మారెడ్డి గూడెం, ఇడుకూడ, తాస్కాని గూడెం , కొండాపురంమునుగోడు మండల పరిధిలోని చోల్లేడు కాకుండా ఇతర గ్రామాల నుండి వందల సంఖ్యలో విద్యార్థులు వస్తారు. కానీ వారంతా సమయానికి బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో ఎన్నోసార్లు బోడంగిపర్తి గ్రామానికి విద్యార్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకున్న ఇప్పటివరకు ఏ ఫలితం లేదు. ఈ గ్రామానికి ఒకే ఒక బస్సు ఈ మధ్యకాలంలో నడుస్తున్నది. కానీ విద్యార్థులకు మాత్రం బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రజలు, విద్యార్థులు, ఆటోలలో ప్రయాణిస్తే ప్రమాదమని తెలిసి కూడా ఈ గ్రామానికి బస్సులు లేనందున గమ్యస్థానానికి చేరాలంటే ఆటోలలో ప్రయాణించాల్సిందే.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో పల్లె వెలుగు బస్సులు ప్రవేశపెట్టడం ప్రభుత్వ ఉద్దేశం. అయితే బస్సులు లేకపోవడం వల్ల చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామానికి మహాలక్ష్మి పథకం వర్తించడం లేదు. మండల పరిధిలోని మారుమూల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా తాస్కాని గూడెం, బోడంగిపర్తి గ్రామాల ప్రజలు ఇటు నల్లగొండకు, అటు హైదరాబాద్‌కు పోవాలంటే ఇక్కడినుండి మునుగోడుకు, లేకుంటే చండూరుకు ఆటోలలో చేరుకొని వారి గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఎన్నో సంవత్సరాల తరబడి బోడంగిపర్తి పాఠశాలకు ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలకు ఆటోలలో ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు ఆటోలు పల్టీ కొట్టి ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బోడంగిపర్తి పాఠశాలకు విద్యార్థులకు, ఆ గ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read : వయస్సు 16, బరువు 275 కేజీలు.. ఢిల్లీ బాలుడికి క్రిటికల్ సర్జరీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>