Mobile Popup Ad
Mobile Popup Ad

14 కోట్ల మోసం: సంధ్యా కన్వెన్షన్ ఎండీపై మరో కేసు

కలం, వెబ్​ డెస్క్​ : సంధ్యా కన్వెన్షన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రావు (Sridhar Rao) మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆర్థిక మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన ఎథెనా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను రూ.14 కోట్ల మేర మోసం చేసినట్లు శ్రీధర్ రావుపై ఫిర్యాదు అందింది. ఫోర్జరీ పత్రాలు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమను నమ్మించి మోసం చేశారని సదరు సంస్థ ప్రతినిధులు పోలీసులకు వివరించారు.

ఈ కుట్రలో శ్రీధర్ రావుతో పాటు ఆయన భార్యకు కూడా భాగస్వామ్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎథెనా ప్రాజెక్ట్స్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (EOW) పోలీసులు.. శ్రీధర్ రావు, అతని భార్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా శ్రీధర్ రావుపై పలు భూవివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులు ఉండటం గమనార్హం. తాజాగా నమోదైన ఈ కేసుతో ఆయన చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>