కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నేడు, రేపు తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భాకరాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, వినతులను స్వీకరించనున్నారు.
జగన్ పర్యటనలో భాగంగా నేడు ఉదయం 10:30 గంటల నుంచి క్యాంప్ ఆఫీసులో ప్రజలను కలవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై జగన్ నాయకులతో దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ రోజు రాత్రికి పులివెందుల నివాసంలోనే బస చేసి, పర్యటన ముగిసిన అనంతరం తాడేపల్లికి తిరిగి పయనం కానున్నారు.

