కలం, వెబ్ డెస్క్ : అస్సాంలోని గౌహతిలో జరిగిన సంచలన కాల్పుల (Guwahati Shooting) ఘటన స్థానికంగా కలకలం రేపింది. బోరా సర్వీస్ ప్రాంతంలోని హోటల్ ‘బిలాస్ ఇన్’ వద్ద సోమవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మోడరన్ పిస్టల్‌తో దుండగుడు జరిపిన ఈ కాల్పులు యాదృచ్ఛికంగా జరిగినవి కాదని, ముందస్తు పథకం ప్రకారం సాగిన టార్గెటెడ్ హిట్టని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మృతులను హోటల్ యజమాని హెలేనా భారాలి, ఆమె కుమారుడు దేబార్షి కష్యప్, అతని భార్య, హెలేనా సోదరుడు, డ్రైవర్ నారాయణ్ దాస్‌లుగా గుర్తించారు. హోటల్ లీజుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వివాదాలే ఈ సామూహిక హత్యలకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. హోటల్ యజమాని వర్గానికి, లీజుకు తీసుకున్న వ్యక్తికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన ఘనకాంత గొగోయ్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

