కలం, వెబ్ డెస్క్: మాజీ భారత క్రికెటర్లు శ్రీశాంత్ (Sreesanth), గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మధ్య జరిగిన వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 2023 డిసెంబరులో లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన వాగ్వాదంపై శ్రీశాంత్ తాజాగా మరిన్ని వివరాలు వెల్లడించాడు. గంభీర్ తనను కేవలం “ఫిక్సర్” అని మాత్రమే కాకుండా “దేశద్రోహి” అని కూడా సంబోధించాడని ఆరోపించాడు. శ్రీశాంత్ వివరాల ప్రకారం, మ్యాచ్‌లో గంభీర్ తొలి బంతికే షాట్ ఆడాడు. ఆ తర్వాత తాను బౌన్సర్ వేయడంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తత మొదలైందని చెప్పాడు.
ఆ సమయంలో గంభీర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, తనను ఫిక్సర్ అని పిలిచాడని పేర్కొన్నాడు. తాను గంభీర్‌ను పరిస్థితి బాగానే ఉందా అని అడిగానని, అయితే ఆ తర్వాత కూడా ఆయన తనపై అదే పదాలు ఉపయోగించాడని శ్రీశాంత్ (Sreesanth) ఆరోపించాడు. ఈ ఘటనలో తనపై “దేశద్రోహి” అనే వ్యాఖ్య కూడా చేశాడని వెల్లడించాడు. గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్లలో సభ్యులుగా ఉన్నారు.
అయితే ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వారి సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్‌కు అప్పట్లో జీవితకాల నిషేధం విధించారు. తర్వాత బీసీసీఐ దాన్ని ఏడేళ్లకు తగ్గించడంతో 2020లో మళ్లీ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. మరోవైపు గౌతమ్ గంభీర్ ప్రస్తుతం భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఆయన కోచింగ్‌లో భారత్ ఇప్పటికే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచకప్ 2026 టైటిళ్లను గెలుచుకుంది.
Read Also: ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉందా? ఈ ఫేస్ ప్యాక్స్ మీకోసమే
Follow Us On: Instagram

