కలం, వెబ్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్లు శ్రీశాంత్(Sreesanth), హర్భజన్ సింగ్ (Harbhajan Singh) మధ్య పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2008 ఐపీఎల్‌లో చోటుచేసుకున్న ‘స్లాప్‌గేట్’ (Slapgate) ఘటనను ఆధారంగా చేసుకుని హర్భజన్ సింగ్ ఒక ప్రకటనలో నటించడం ఈ వివాదానికి కారణమైంది. పాత విభేదాలు సద్దుమణిగాయని భావిస్తున్న సమయంలో ఈ యాడ్‌తో ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్, హర్భజన్‌తో ఉన్న పాత బాక్సింగ్ ఫోటోను చూసి స్పందిస్తూ, భజ్జీకి నేరుగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చి తనతో తలపడే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. కేవలం ప్రకటనలలో నటించడం కాకుండా, నిజంగానే గ్లోవ్స్ వేసుకుని రింగ్‌లోకి వచ్చి పోరాడాలని సవాల్ చేశారు. ప్రస్తుతం తాను బేర్ నకిల్ ఫైట్ లీగ్‌లో ఉన్నానని శ్రీశాంత్ (Sreesanth) వెల్లడించారు. ఈ స్లాప్‌గేట్ వివాదంతో హర్భజన్ ఇప్పటికే భారీగా సంపాదించారని, ఇప్పుడు తనకూ అవకాశం ఇవ్వాలని అన్నారు. ప్రకటనలు మానేసి, నిజాయితీగా రింగ్‌లోకి వచ్చి పోటీ పడాలని పిలుపునిచ్చారు. ఈ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఈ ఇద్దరు మాజీ క్రికెటర్ల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: ఎల్ నినో కరువు ముప్పు.. తాతలనాటి నేరేడు రహస్యం ఏం చెబుతోంది?
Follow Us On : WhatsApp

