కలం, స్పోర్ట్స్: దాదాపు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ నాటి సంచలన వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. హర్భజన్ సింగ్‌ను (Harbhajan Singh) శ్రీశాంత్ బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మంటూ బహిరంగంగా సవాల్ విసిరాడు. అయితే, ఈ వివాదాన్ని సామరస్యంగా ముగించడానికే తాను మొగ్గు చూపుతానని హర్భజన్ స్పష్టం చేశాడు. వీరిద్దరి మధ్య గొడవ 2008 ఐపీఎల్ మొదటి సీజన్‌లో మొదలైంది. ఒక మ్యాచ్ తర్వాత శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటనపై శ్రీశాంత్ మైదానంలోనే తీవ్రంగా ఏడ్చాడు. దీంతో హర్భజన్‌పై 11 ఐపీఎల్ మ్యాచ్‌ల నిషేధంతో పాటు భారీ జరిమానా పడింది.
అయితే, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్లలో వీరిద్దరూ కలిసి ఆడటం గమనార్హం. ఇటీవల హర్భజన్, శ్రీశాంత్ బాక్సింగ్ గ్లోవ్స్ ధరించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. దాని ఆధారంగానే శ్రీశాంత్ ఈ సవాల్ చేశాడు. తనతో బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చే ధైర్యం హర్భజన్‌కు ఉందా అని ప్రశ్నించాడు. సంతకం చేసి మరి రింగ్‌లోకి రావాలని, ఇది నటన కాదని తేల్చి చెప్పాడు.
తాను నవ్వుతూనే ఈ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నానని తెలిపాడు. ఈ సవాల్‌పై హర్భజన్ సింగ్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ద్వారా స్పందించాడు. ఇద్దరం ఒకే గదిలో ఉంటే చాలా సమస్యలు సమసిపోతాయని అభిప్రాయపడ్డాడు. శ్రీశాంత్‌తో ఒకే గదిలో రూమ్‌మేట్‌గా ఉండటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించాడు.

