గ్లామర్ ఫుల్, సక్సెస్ నిల్.. యంగ్ బ్యూటీకి వరుసగా ఫెయిల్యూర్స్

కలం, వెబ్ డెస్క్: సినీ పరిశ్రమలో గ్లామర్ పరంగా ఏమాత్రం తక్కువ కాకపోయినా, సరైన హిట్స్ పడక కొందరు హీరోయిన్ల సతమతమవుతున్నారు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు యంగ్ హీరోయిన్లు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తమ గ్లామర్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్నప్పటికీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. అలాంటే పరిస్థితే శ్రీలీల (Sreeleela) ఎదుర్కొంటుంది.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రేజ్‌తో విజయాల బాట పట్టాలని ఆశించింది. కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశపర్చింది. గతేడాది రాబిన్‌హుడ్, జూనియర్, మాస్ జాతర వంటి చిత్రాలు ఆమె కెరీర్‌కు పెద్దగా సహాయపడలేదు. ఈ సంవత్సరం కూడా పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు హిట్స్ అందించలేకపోయాయి. ఒకవైపు గ్లామర్‌ను కాపాడుకుంటూ.. మరోవైపు నటనలో కూడా మరింత పరిణితిని ప్రదర్శిస్తోంది. ఇన్ని బలాలు ఉన్నప్పటికీ విజయం అందుకోలేకపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>